టెన్త్ పేపర్ లీకైతే ఎమ్మెల్యేకిఏం సంబంధం? : వేముల వీరేశం

టెన్త్  పేపర్  లీకైతే ఎమ్మెల్యేకిఏం సంబంధం? : వేముల వీరేశం
  • ఎమ్మెల్యే వేముల వీరేశం

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పేపర్  లీక్  అయితే ఎమ్మెల్యేకు ఏం సంబంధం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశ్నించారు. ఎగ్జామ్  నిర్వహణకు సిస్టం, ఆఫీసర్లు ఉంటారని ఆయన అన్నారు. నకిరేకల్ లో పదో తరగతి పేపర్  లీక్  కావడంపై తనపై ప్రతిపక్ష నేతలు సోషల్  మీడియాలో పోస్టులు పెట్టడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో వేముల వీరేశం చిట్ చాట్ చేశారు.  

పేపర్  లీక్  చేయడం బీఆర్ఎస్  వాళ్లకు అలవాటే అని ఎద్దేవా చేశారు. గ్రూప్ 1 క్వశ్చన్  పేపర్ ను పల్లీ బఠాణీలు అమ్మినట్లు అమ్ముకున్నారని మండిప్డడారు. చదువు విలువ తెలిసిన వారు సామాజిక బాధ్యతతో మాట్లాడుతారని, గాల్లో వచ్చిన వారికి విలువలు ఉండవని విమర్శించారు. గాలిమేడలు కట్టిన వారు గాలిలో కలిశారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.