బీఆర్ఎస్​ వల్లే రియల్​ఎస్టేట్ రంగం కుదేలు : వేముల వీరేశం

బీఆర్ఎస్​ వల్లే రియల్​ఎస్టేట్ రంగం కుదేలు  : వేముల వీరేశం
  • నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం 

నకిరేకల్, వెలుగు : బీఆర్ఎస్ తప్పిదాల వల్లే తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్ లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ధరణి పేరుతో దొరలు పేదల భూములు లాక్కున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతితో త్వరలో వారి భూ దందాలు బయటికి తీస్తామన్నారు. 

నకిరేకల్ లో100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు 95 శాతం పూర్తి అయ్యిందని, ఈనెల చివరి నాటికి కంప్లీట్​అవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. అనంతరం వీటీ కాలనీలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయిన బాధితుడి కృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అంతకుముందు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో రూ.కోటీ 70 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.