ఎలక్ట్రీషియన్లకు మూడ్రోజుల పాటు టెక్నికల్ శిక్షణ : నక్క యాదగిరి

ఎలక్ట్రీషియన్లకు మూడ్రోజుల పాటు టెక్నికల్ శిక్షణ : నక్క యాదగిరి
  • నేటి నుంచి తరగతులు ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రీషియన్లకు మూడ్రోజుల పాటు టెక్నికల్ శిక్షణ అందించనున్నట్టు తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క యాదగిరి తెలిపారు. ఈ నెల 21 నుంచి మూడ్రోజుల పాటు టెక్నికల్ శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. ఎలక్ట్రీషియన్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవడానికి, కరెంటు ప్రమాదాలను అరికట్టడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లు అవసరమని పేర్కొన్నారు. 

సోమ, మంగళవారాల్లో మదీనాగూడలోని రవీలా గ్రాండ్ బాంకెట్ హాల్, బుధవారం నాగోల్​లోని వైట్​పర్ల్​బాంకెట్ హాల్​లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు  టెక్నికల్ సెమినార్ ఉంటుందని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎలక్ట్రీషియన్లు ఈ టెక్నికల్ సెమినార్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.