ఫారెస్ట్ పర్మిషన్లు రాకనే నక్కలపల్లి బ్రిడ్జి పెండింగ్

  • ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం ఏమీ లేదు 
  • ఆర్ అండ్ బీ డీఈ భావ్ సింగ్ 

మంచిర్యాల, వెలుగు: కోటపల్లి మండలంలోని మల్లంపేట-నక్కలపల్లి గ్రామాల మధ్య ఉన్న లోతొర్రెపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఫారెస్ట్ పర్మిషన్లు రాలేదని ఆర్అండ్​బీ డీఈఈ భావ్ సింగ్ తెలిపారు. ఫండ్స్ శాంక్షన్ అయినప్ప టికీ పర్మిషన్లు రాకపోవడంతోనే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమమవుతోందని, ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యమేమీ లేదని స్పష్టం చేశారు. 

లోతొర్రెపై హై లెవల్ బ్రిడ్జి కోసం లెఫ్ట్ వింగ్ ఎక్స్​ట్రీమిజం (ఎల్ డబ్ల్యూఈ) స్కీమ్ కింద రూ.2.68 కోట్లు అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 11 సార్లు టెండర్లు పిలిచినప్పటికీ రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో బిడ్డర్స్ పాల్గొనలేదన్నారు. అటవీ శాఖ అనుమతులు రాకుండా బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఫారెస్ట్ కన్సర్వేటివ్ యాక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు.

 

 ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోలెవెల్ రోడ్డు, డ్యామ్ కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతున్నప్పటికీ ఫారెస్ట్ పర్మిషన్లు లేకుండా రిపేర్లు కూడా చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ఖండించారు.