
- టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు
నకిరేకల్, వెలుగు : నల్గొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అసత్య ప్రచారం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుతో నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌పై మూడు కేసులు నమోదు అయ్యాయి. లతో తమకు సంబంధం లేకున్నా సోషల్ మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ నకిరేకల్ మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజితతో పాటు ఉగ్గిడి శ్రీనివాస్, నకిరేకంటి నరేందర్ బుధవారం వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్‌లో షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్‌తో పాటు కొణతం దిలీప్‌కుమార్, మన్నె క్రిశాంక్‌పై, తెలుగు స్క్రైబ్ ఎండీ, మిర్రర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎండీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.