
- కొడంగల్ మున్సిపాలిటీలో సర్వే షురూ
కొడంగల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం చేపట్టిన నక్ష సర్వేతో ఇల్లు, స్థలాల వివాదాలకు పరిష్కారం లభిస్తుందని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ సుధీర్, సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి సుధీర్గోళి తెలిపారు. కొడంగల్మున్సిపాలిటీలో మంగళవారం నక్ష సర్వేను ప్రారంభించారు. వ్యవసాయ భూముల మాదిరిగా పట్టణంలో సర్వే నిర్వహించి ఇల్లు, భూములు, ప్రభుత్వ స్థలాలను గుర్తించి మ్యాప్‌లు రూపొందించనున్నట్లు చెప్పారు. అనంతరం యజమాని పేరు, ప్రాపర్టీ వివరాలతో ఆధార్ కార్డు మాదిరిగా యూనిక్ఐడెంటిటీ నెంబర్‌తో ప్రాపర్టీ కార్డు జారీ చేయనున్నట్లు వివరించారు.
నక్షతో పారదర్శకంగా ఆస్తి పన్ను, మార్కెట్ విలువ పెరుగుదల, అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకునేందుకు ప్రాపర్టీ కార్డులు ఉపయోగపడతాయన్నారు. కడా స్పెషల్ఆఫీసర్వెంకట్రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్రాజేశ్రెడ్డి, నోడల్ఆఫీసర్ఉమామహేశ్వర్రావు, సమీరుద్దీన్, తహసీల్దార్విజయ్కుమార్, కమిషనర్బలరాం నాయక్, ఎంపీడీఓ ఉషశ్రీ పాల్గొన్నారు.