నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

మునుగోడు, వెలుగు : సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబ పాలనను అంతమొందించడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్‌‌‌‌‌‌‌‌ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడులో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21 చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌షా హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి తన అనుచరులతో బీజేపీలో చేరుతారన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పాలన అంతం చేసేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు దోటి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, పాల్వాయి గోవర్దన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీటీసీ పల్లె వెంకన్న, ఎంపీటీసీ నాతి విషువర్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

సభా స్థలం పరిశీలన

చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని అంగడిపేటలో ఈ నెల 21న నిర్వహించే బీజేపీ బహిరంగ సభా స్థలాన్ని బుధవారం ఆ పార్టీ స్టేట్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ గూడూరు నారాయణరెడ్డి పరిశీలించారు. డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ కుంభం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీటీసీ పల్లె వెంకన్న, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

ముత్తయ్య ఆత్మహత్య కారకులపై చర్య తీసుకోవాలి

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లా దోమపల్లికి చెందిన గాదె ముత్తయ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని గ్రామానికి చెందిన దళితులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు బుధవారం నల్గొండ రూరల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామానికి చెందిన గాదె ముత్తయ్య, విజయ్, వేణుకు చెందిన ఇంటి పక్కనే అదే గ్రామానికి చెందిన గుర్రం యాదయ్య భూమి ఉందన్నారు. భూమి హద్దుల విషయంలో రెండు ఫ్యామిలీల మధ్య గతంలో గొడవలు జరుగగా గ్రామస్తుల సమక్షంలో మాట్లాడుకున్నా తేలలేదని చెప్పారు. దీంతో యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం గాదె విజయ్‌‌‌‌‌‌‌‌ను పట్టుకెళ్లారన్నారు. విషయం తెలుసుకున్న ముత్తయ్య పురుగుల మందు తాగడంతో చనిపోయాడన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే పోలీసులు ముత్తయ్య ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ముత్తయ్య ఆత్మహత్యకు కారణమైన గుర్రం యాదయ్య అతడి కుమారులు నరేశ్‌‌‌‌‌‌‌‌, మహాత్మా, రాములుతో పాటు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మండల అధ్యక్షుడు వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చార్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న కలెక్టర్లు 

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా టి.వినయ్‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి బుధవారం చార్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న ఆయనను నల్గొండకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. ఆయనకు అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌శర్మ, నల్గొండ ఆర్డీవో జగన్నాథరావు బొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది అభినందనలు తెలిపారు.

సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడి కలెక్టర్ వినయ్‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డిని నల్గొండకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రభుత్వం అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. చార్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ నాన్‌‌‌‌‌‌‌‌ గెజిటెడ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల సంఘం ఆఫీసర్లు శాలువాతో సన్మానించి, మొక్కను అందజేశారు. కార్యక్రమంలో నాన్‌‌‌‌‌‌‌‌ గెజిటెడ్ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌ యూనియన్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జానీమియా, జిల్లా కార్యదర్శి దున్న శ్యాం, నాయకులు నాయిని ఆకాశ్‌‌‌‌‌‌‌‌ వర్మ, కె.శేఖర్, బి.శ్రీనాథ్, కె.రమేశ్‌‌‌‌‌‌‌‌, బాలాజీ నాయక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి

గరిడేపల్లి/నేరేడుచర్ల, వెలుగు : కష్టపడి పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ గట్టు శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్లలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. మండలంలోని 32 గ్రామాల్లో బూత్‌‌‌‌‌‌‌‌ కమిటీలు వేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆజాదీ కా అమృత్‌‌‌‌‌‌‌‌ మహోత్సవంలో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గరిడేపల్లిలో మండల అధ్యక్షుడు అందె కోటయ్య, చిత్తలూరి సోమయ్య, వెంకటేశ్వర్లు, కర్ణం చంద్రశేఖర్, శ్రీనివాస్, సత్యం, సైదులు, నరేశ్, రాధాకృష్ణ, పాలకవీడు మండల అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, నాయకులు వేముల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కోచింగ్‌‌‌‌‌‌‌‌ ఇష్టం లేక బిల్డింగ్‌‌‌‌‌‌‌‌పై నుంచి దూకిన బాలుడు

మిర్యాలగూడ, వెలుగు : కోచింగ్‌‌‌‌‌‌‌‌ ఇష్టం లేని ఓ బాలుడు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌పై నుంచి దూకాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని గురజాల మండలం పులిపాడుకు చెందిన మురళి అనే బాలుడికి నవోదయతో పాటు, ఇతర పోటీ పరీక్షల కోచింగ్‌‌‌‌‌‌‌‌ ఇప్పించేందుకు తల్లిదండ్రులు బుధవారం మిర్యాలగూడ చర్చిరోడ్డులోని ఓ కోచింగ్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చారు. అయితే కోచింగ్‌‌‌‌‌‌‌‌ తీసుకోవడం ఇష్టం లేని బాలుడు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ నుంచి దూకాడు. గమనించిన పేరెంట్స్‌‌‌‌‌‌‌‌, స్థానికులు బాలుడిని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

ఫ్రీడం రన్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి

సూర్యాపేట, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించనున్న ఫ్రీడం రన్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌ బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. పట్టణంలోని న్యూ బస్టాండ్‌‌‌‌‌‌‌‌ నుంచి మినీ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌ వరకు ఫ్రీడం రన్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రన్‌‌‌‌‌‌‌‌లో యువతీయువకులు, విద్యావంతులు, మేధావులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.

వీఆర్‌‌‌‌‌‌‌‌ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

యాదగిరిగుట్ట, వెలుగు : వీఆర్‌‌‌‌‌‌‌‌ఏలకు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం యాదగిరిగుట్ట తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట వీఆర్‌‌‌‌‌‌‌‌ఏలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. వారికి బీర్ల అయిలయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. వీఆర్‌‌‌‌‌‌‌‌ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు, 55 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. వీఆర్‌‌‌‌‌‌‌‌ఏల డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంపీపీ చీర శ్రీశైలం, సైదాపురం ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌ దుంబాల సురేఖ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాయకులు శిఖ ఉపేందర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు నల్ల గిరిరావు, ఉపాధ్యక్షుడు దశరథ పాల్గొన్నారు.

వీఆర్‌‌‌‌‌‌‌‌ఏలకు మద్దతు తెలిపిన బీఎస్పీ లీడర్లు

తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట వీఆర్‌‌‌‌‌‌‌‌ఏలు చేస్తున్న సమ్మెకు బుధవారం బీఎస్పీ లీడర్లు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌‌‌‌‌‌‌‌ కొండగడుపుల నవీన్‌‌‌‌‌‌‌‌, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు వినోద్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

డాక్టరేట్‌‌‌‌‌‌‌‌ పొందిన టీచర్‌‌‌‌‌‌‌‌కు సన్మానం

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం యూపీఎస్‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌, గరిడేపల్లికి చెందిన గాదె సత్యనారాయణకు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌ అందజేసింది. దీంతో ఆయనను బుధవారం మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల ఏళ్ల క్రితం నాటి కట్టడాలు, ప్రజల జీవన విధానం, పాలన, శాసనాలపై అధ్యయనం చేయడం వల్ల భవిష్యత్‌‌‌‌‌‌‌‌ తరాలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, శాంతినగర్‌‌‌‌‌‌‌‌, వెంకటాద్రిపాలెంలో ఎమ్మెల్యే జాతీయ జెండాలను పంపిణీ చేశారు. డీఎస్పీ వై. వెంకటేశ్వరరావు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ రవీంద్రసాగర్, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు ఇలియాస్, సాధినేని స్రవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

డాక్టరేట్‌‌‌‌‌‌‌‌ పొందిన టీచర్‌‌‌‌‌‌‌‌కు సన్మానం

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం యూపీఎస్‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌, గరిడేపల్లికి చెందిన గాదె సత్యనారాయణకు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌ అందజేసింది. దీంతో ఆయనను బుధవారం మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల ఏళ్ల క్రితం నాటి కట్టడాలు, ప్రజల జీవన విధానం, పాలన, శాసనాలపై అధ్యయనం చేయడం వల్ల భవిష్యత్‌‌‌‌‌‌‌‌ తరాలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, శాంతినగర్‌‌‌‌‌‌‌‌, వెంకటాద్రిపాలెంలో ఎమ్మెల్యే జాతీయ జెండాలను పంపిణీ చేశారు. డీఎస్పీ వై. వెంకటేశ్వరరావు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ రవీంద్రసాగర్, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు ఇలియాస్, సాధినేని స్రవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

మునుగోడులో సత్తా చాటుతాం

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో తమ సత్తా చాటుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బుధవారం చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. మునుగోడులో బలాబలాలను నిర్ణయించే శక్తి కమ్యూనిస్టులకే ఉందన్నారు. ఇక్కడ బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ నెల 13న చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. నల్గొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాయకులు జూలకంటి రంగారెడ్డి, యండి.జహంగీర్, కొండమడుగు నర్సింహ, బండ శ్రీశైలం, దోనూరి నర్సిరెడ్డి, నాగార్జున పాల్గొన్నారు.

విజేతలకు ప్రైజ్‌‌‌‌‌‌‌‌లు అందజేత

తుంగతుర్తి, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా లయన్స్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలోని అనంతారం మోడల్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌లో స్టూడెంట్లకు వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. అనంతరం పోటీల్లో గెలిచిన స్టూడెంట్లకు బహుమతులు అందజేశారు. వ్యాసరచన, పాటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ రమణారెడ్డి, ఎంపీడీవో ఉమేశ్‌‌‌‌‌‌‌‌చారి, ఎస్సై శివకుమార్, ఎంఈవో శాంతయ్య, ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ వేముల బాలరాజు, లయన్స్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు రామచంద్రన్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, అయిత శ్రీనివాస్, సభ్యులు కాకి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.