ఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందుండాలి : నలమాద పద్మావతి

మునగాల, వెలుగు :  ఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందుండాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి సూచించారు. శుక్రవారం మునగాల ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, పండిట్ జవహర్‌‌‌‌లాల్‌‌ నెహ్రూ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభ్యున్నతికి తనవంతుగా సంపూర్ణ సహకారం అందిస్తానని మాటిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆర్యవైశ్యులు భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

 ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎలక బిందు,  జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల, వైస్ ఎంపీపీ  బుచ్చి పాపయ్య, సింగిల్ విండో చైర్మన్ కందిబండ సత్యనారాయణ, ఎంపీటీసీలు కాసర్ల కల్పన, ఉప్పుల రజిత, వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ వంగవీటి గురుమూర్తి, మండల ప్రసిడెంట్​ నల్లపాటి మణికంఠ,  సంఘం నేతలు  కోటేశ్వరరావు,  శ్రీనివాసరావు,  శంకర్,  రవి,  నాగేశ్వరరావు పాల్గొన్నారు.