
ఒడిశా రాష్ట్రం అంగుల్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) 2022–-23 సంవత్సరానికి 375 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. ట్రైనింగ్ ఏడాది ఉంటుంది. సీనియారిటీ, ఐటీఐ/ హెచ్‌ఎస్‌సీ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా ఆర్డినరీ పోస్టు ద్వారా డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్‌డీ) కార్యాలయం, ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్, ఎస్ & పి కాంప్లెక్స్, నాల్కో, అంగుల్ జిల్లా ఒడిశా అడ్రస్‌కు డిసెంబర్ 7 వరకు పంపించాలి. పూర్తి వివరాల కోసం www.nalcoindia.com వెబ్సైట్లో అభ్యర్థులు సంప్రదించాలి.