నల్దుర్తి అడవిలో పక్షి ప్రేమికుల ఆనందం

నల్దుర్తి అడవిలో పక్షి ప్రేమికుల ఆనందం
  • నిర్మల్ జిల్లాలో తుర్కం, 
  • పొన్కల్ వెంగన్న చెరువులను సందర్శించిన పర్యాటకులు

లక్ష్మణచాంద(మామడ)వెలుగు: పక్షి ప్రేమికులకు నిర్మల్ జిల్లా మామడ మండలంలోని రెండు చెరువులు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో నల్దుర్తి తుర్కం చెరువు, పొన్కల్ వెంగన్న చెరువుల వద్ద అటవీశాఖ బర్డ్ వాచ్, నేచురల్ క్యాంప్ నిర్వహిస్తోంది. ఆదివారం హైదరాబాద్ నుంచి దక్కన్ బర్డర్స్ సొసైటీ నుంచి15 మంది పర్యాటకులు సందర్శించారు. 

దాదాపు 60 జాతుల పక్షులను గుర్తించి తమ కెమెరాల్లో బంధించారు. అటవీ అధికారులు సపారి వాహనంలో పలు ప్రదేశాలు చూపించారు. దిమ్మదుర్తి రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ నేచర్ క్యాంపులను నిర్వహిస్తోందన్నారు. హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ సిటీల నుంచి పర్యాటకులు వస్తుండడంతో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు.  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాలని పొన్కల్, నల్దుర్తి గ్రామస్తులు కోరుతున్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రావు, ఎఫ్ఎస్ఓ శ్రీనివాస్, అన్నపూర్ణ, ఎఫ్ బీఓ లక్ష్మీనర్సయ్య, సంజయ్, అంజయ్య ఉన్నారు.