హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

తెలంగాణలోని రహదారులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి.  తాజాగా నల్లగొండ జిల్లా నకిరేకల్ వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  నెల్లబండ గ్రామం హైవే పక్కన కల్వర్టను కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  మృతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తండ్రీ కొడుకులు మల్లేష్(59) ,అవినాష్(34) గా గుర్తించారు.  

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ప్రమాదంలో కారు నుజ్జు కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు మరణించారు.  మరణానంతర పరీక్షల కోసం పోలీసులు మృతదేహాలను కిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.