నల్గొండ, వెలుగు : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, పీహెచ్సీలు, సీహెచ్ఎసీల్లో మౌలిక సేవలపై జిల్లా ఆఫీసర్లు మానిటరింగ్చేస్తారే తప్ప.. ఎవరిపైనా కర్ర పెత్తనం చేయరని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. కొద్దిరోజులుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, ఆఫీసర్లు కలెక్టర్ఆదేశాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. గురువారం ఆస్పత్రి బయట డాక్టర్లు ధర్నాకు దిగారు.
ఈ సంఘటన పై కలెక్టర్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నిరంతరం మానిటరింగ్చేస్తున్నారు. ఈ విషయంలో డాక్టర్లు, అధికారులు, సిబ్బందిని నిలదీసే, నియంత్రించే అధికారం ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. రోగులకు ఇబ్బంది లేకుండా, ఆస్పత్రిలో పారిశుధ్యం, ఆపరేషన్థియేటర్లు, జనరల్వార్డులు, సీజేరియన్వార్డులు, పిల్లల విభాగాలు, ఐసీయూ, డాక్టర్ల హాజరు, భోజనం, తాగునీరు వంటివన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలన మాత్రం చేస్తారని, దానిపై ఆఫీసర్లు ఇచ్చే రిపోర్ట్ఆధారంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఓపీ సేవలు, రోగులకు వీల్ చైర్లు, స్ట్రేచర్ వంటివి ఏర్పాటు చేసేందుకు సిబ్బంది సహాయకుల పనితీరును మాత్రమే పరిశీలించనున్నట్లు తెలిపారు. దీంతో ఆస్పత్రికి మంచి పేరు వస్తుందే తప్ప.. ఎవరిపై ఎలాంటి దురుద్దేశం ఉండదని కలెక్టర్క్లారిటీ ఇచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర ఆస్పత్రికి చేరుకుని డాక్టర్లు, ఆఫీసర్లు, సిబ్బందితో మాట్లాడారు.
ఇన్ టైంలో పనులు పూర్తిచేయాలి..
మిర్యాలగూడ, వెలుగు : దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ పనులను ఇన్ టైంలో పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ను ఆయన సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ థర్మల్ పవర్ స్టేషన్ కు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే పరిష్కరించాలని ఆర్డీవో శ్రీనివాసరావును ఆదేశించారు. వైటీ పీఎస్ కు సంబంధించి భూసేకరణ బకాయిలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట వైటీ పీఎస్ చీఫ్ ఇంజినీర్ సమ్మయ్య, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, వైటీ పీఎస్ డీఎస్పీ తదితరులు ఉన్నారు.