నల్గొండ అర్బన్, వెలుగు : నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండలోని కలెక్టరేట్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,31,831 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ దరఖాస్తులన్నీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ ద్వారా అధికారులు పరిశీలించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్టార్ట్..
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభమైంది. ఈ సర్వేను గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల నేతృత్వంలో పంచాయతీ సెక్రటరీలు నిర్వహిస్తుండగా, మున్సిపాలిటీల్లో స్టాఫ్నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లయ్చేసుకున్న వారి వద్దకు వెళ్లి ఇంటి స్థల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలు సేకరిస్తున్నారు.
ఇంటి స్థలం ధ్రువీకరణ కోసం జియో టాగింగ్ ద్వారా ఫొటో తీసుకొని మొబైల్ యాప్లో అప్లోడ్చేస్తున్నారు. సర్వే కోసం వచ్చే స్టాఫ్కు ప్రజలు సహకరించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. సర్వేకు సంబంధించిన అనుమానాలు ఉంటే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్ 08685-293312 ను సంప్రదించాలని సూచించారు. Indiramma Indla, Collector Ila Tripathi, Nalgonda, Application Scrutiny, Indiramma Indla