నల్గొండ, వెలుగు: నల్గొండ కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ బదిలీ అయ్యారు. ఆయనను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జులై 25న కరీంనగర్ జిల్లా నుంచి నల్గొండకు బదిలీపై వచ్చారు. వచ్చీరాగానే హెల్త్ డిపార్టమెంట్‌పై ఫోకస్ పెట్టారు. సీజనల్వ్యాధులు ప్రబలకుండా ప్రతి శుక్రవారం ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంతో సక్సెస్ అయ్యారు.
రాజకీయాలకు అతీతంగా ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేసి ఎన్నికల కమిషన్ నుంచి ప్రశంసలు పొందారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌లో స్వయంగా పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపించారు.