రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. 2024, జూలై 5వ తేదీ శుక్రవారం ఉదయం పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పులు జరిపారు. నగర శివారు ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ఇండ్లను టార్గెట్ చేసిన మహారాష్ట్రకు చెందిన పార్థ గ్యాంగ్ చోరీలకి పాల్పడుతోంది. పక్కా సమాచారంతో దొంగల స్థావరాలను పసిగట్టి పట్టుకోవడానికి నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యత్నించారు.
ఈ క్రమంలో పార్థ గ్యాంగ్.. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులపై కత్తులతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో దుండగుల పట్టుకునేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం పార్ధా గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నల్గొండకు తరలించారు. దారి దోపిడీలో భాగంగా పలు హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పార్థ గ్యాంగ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO Read : తొర్రూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : యశస్విని రెడ్డి