పురుగుల మందు తాగిన ఇద్దరు విద్యార్థులు మృతి

నల్గొండలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని రాజీవ్ పార్కులో నిన్న(సెప్టెంబర్ 05) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఏం జరిగిందంటే..  

నార్కట్ పల్లి మండలం నక్కలపల్లికి చెందిన శివాని, అమ్మనబోలు గ్రామానికి చెందిన మనీషా ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులు. కాగా వారిద్దరూ ఎస్సీ హాస్టల్లో ఉంటూ.. నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

ALSO READ : సనాతన దుర్మార్గపు వైఖరి మారాలి.. స్టాలిన్కు మ‌ద్ద‌తుగా పా. రంజిత్

గత 20 రోజులుగా ఇంటి వద్దనే ఉన్న వీరిద్దరు.. కాలేజ్ కి వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పి మంగళవారం(సెప్టెంబర్ 05) ఉదయం బస్సులో నల్గొండ వచ్చారు. అనంతరం ఎన్జీ కాలేజ్ వెనుక ఉన్న రాజీవ్ పార్కులోకి ఇద్దరూ వెళ్లి గడ్డి మందు తాగారు. ఆ తర్వాత పార్కు గేట్ దగ్గరకు వచ్చి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు.

అయితే కొందరు ఇన్స్టాగ్రామ్ లో వారిద్దరిని వేధిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరి ఫోన్ ను పోలీసులు పరిశీలించగా ఎవరూ వారిని వేధించడం లేదని నిర్ధారించారు. వారి ఫోన్ లో కాల్ డేటాను పరిశీలించగా.. ఇద్దరు విద్యార్థినులు మధ్యే ఎక్కువగా ఫోన్ సంభాషణ ఉన్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. మరోవైపు వారిద్దరి బ్యాగులో నిద్రమాత్రలు దొరికాయని చెప్పారు. విద్యార్థినులిద్దరూ ప్రాణ స్నేహితులు కావడంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు.