భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి

భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి

ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఆదివారం భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్​సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ పాలకులను ఎదిరించి 23 ఏండ్ల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన వీరుడు భగత్​సింగ్​అని కొనియాడారు. భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాదానికి  వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు,  నాయకులు పాల్గొన్నారు. - వెలుగు, నెట్​వర్క్