బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య ఘర్షణ

చండూరు, వెలుగు : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లిలో  ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎండోమెంట్ ఈవో ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు మండలం ఉకొండి ఎంపీటీసీ భర్త సైదులు మాట్లాడాలని చెప్పారు. 

దీంతో సైదులు బీజేపీ రాష్ట్ర నాయకుడు,  మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై విమర్శలు చేయడంతో బీజేపీ నాయకుడు  పల్లె వెంకన్న మధ్యలో కలుగజేసుకున్నాడు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాయకులను విమర్శించడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో వెంకన్నతో బీఆర్ఎస్ లీడర్లు వాగ్వాదానికి దిగారు. వెంటనే పోలీసులు వెంకన్నను పక్కకు లాక్కెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.