చిట్యాల, వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాలలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వెంచర్లో గురువారం భారీ చోరీ జరిగింది. వెంచర్లో ఉంటున్న వ్యాపారి గంజి రామ్మూర్తి గురువారం ఉదయం తన బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం కోదాడ వెళ్లాడు.
సాయంత్రం చిట్యాలలోని ఇంటికి తిరిగి వచ్చాడు. గేటు తీసి ఉండడంతో పాటు తలుపులు తెరిచి ఉన్నాయి. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూశాడు. సామాన్లన్నీ చిందరవందరగా పడేసి ఉండడంతో చూసుకోగా 50 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నల్గొండ డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ శివరామిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.