నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్

నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్

నల్లగొండ జిల్లా: పెద్దగట్టు (దురాజపల్లి)జాతర సందర్భంగా నల్లగొండ జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం(ఫిబ్రవరి 17, 2025) సెలవు ప్రకటించారు. దురాజుపల్లి పెద్దగట్టు జాతర సరళిని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. పోలీస్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పని తీరుపై ఆరా తీశారు. గుట్ట చుట్టూ భద్రతా చర్యలను తనిఖీ చేసి, పోలీసు బందోబస్తును పరిశీలించారు.

ఎగ్జిబిషన్ రోడ్డు, కోనేరు, VIP మార్గం, హైవేపై వాహనాల శ్రేణి, తూర్పు మెట్ల వద్ద బందోబస్తు, భద్రతా చర్యలను తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి తొక్కిసలాటకు తావు లేకుండా స్వామిని భక్తులు  దర్శించుకునేలా చూడాలని పోలీసులకు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.

ALSO READ | సూర్యాపేట జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు

లక్షలాది మంది భక్తులు తరలిరానున్న పెద్దగట్టు లింగమతులస్వామి జాతరకు పోలీస్ శాఖ సమాయత్తమైంది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసింది. ఐదు రోజులపాటు జాతర జరగనుంది. ఇందుకోసం 2 వేల మంది పోలీస్ సిబ్బంది, 500 మంది వాలంటీర్లను నియమించారు. 68 సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో రెండేండ్లకు ఒకసారి జరిగే రెండో అతిపెద్ద జాతరైన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. లింగమంతుల స్వామి జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు. సూర్యాపేట నుంచి పెద్దగట్టు జాతరకు బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20 అని తెలిపారు.