ఎస్ఐ క్రాంతి...క్రిడాకారుడికి రెండు నెలల జీతం

నల్లగొండ జిల్లా హాలియా ఎస్ఐ క్రాంతి కుమార్ మానవత్వం చాటుకున్నారు. జాతీయ కబడ్డీ  క్రీడాకారుడు సందీప్ కు తన రెండు నెలల జీతాన్ని విరాళంగా ఎస్ఐ క్రాంతి అందించారు. కొన్ని రోజుల క్రితం హర్యానా ఇండియా కబడ్డీ  కోచింగ్ క్యాంప్ లో సందీప్ లెగ్మెంట్ కు గాయమైంది. దీంతో సర్జరీ చేసేందుకు పెద్ద మొత్తంలో నగదు అవసరం పడింది. ఈ క్రమంలో  దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న సందీప్ విషయం తెలుసుకుని.. SI క్రాంతికుమార్ అతడికి సహాయం చేశారు. రాష్ట్రస్థాయిలో ఆరుసార్లు ఉత్తమ ప్లేయర్ గా, 8 సార్లు నేషనల్స్ ఖేలో ఇండియా విభాగానికి సందీప్ ఎంపికయ్యాడు.