నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. 8 మందికి గాయాలు

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కెట్ పల్లి మండలం ఏపీ లింగోటం జాతీయ రహదారిపై దగ్గర హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ లో తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని విజయవాడ రాజధాని డిలక్స్ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 

క్షతగాత్రులను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.