
హైదరాబాద్: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగియడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి లీడ్‌లో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఒక్కో రౌండ్లో అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ ఓట్లను లెక్కిస్తున్నారు. 10వ రౌండ్లో 9వ అభ్యర్థి ఎలిమినేట్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్లు మొత్తం 23,641 కాగా.. 24,135 ఓట్లు పోలయ్యాయి.
ALSO READ | రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఒప్పుకునేది లేదు: కోదండరాం
ఇందులో 494 చెల్లని ఓట్లు. శ్రీపాల్‌రెడ్డికి 6,054 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,842 ఓట్లు, టీపీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి 4,451 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి పూల రవీందర్‌కి 3,140 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,304 ఓట్లు పడ్డాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. ఒకవేళ తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేతలు తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటా ఓట్లు 11,822. అయితే.. ఏ అభ్యర్థికి అన్ని ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు.