ప్రియుడి మోజులో పడి కొడుకును చంపిన కేసులో.. ఇద్దరికి జీవిత ఖైదీ

ప్రియుడి మోజులో పడి కన్న కొడుకును చంపిన కేసులో.. ఇద్దరికి జీవిత ఖైదీగా నల్గొండ జిల్లా కోర్టు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..

నల్గొండ మండలం బుద్ధారంలో పల్లెటి విజయ (27), తోకల వెంకట్ రెడ్డి (74) మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. కొడుకుని తల్లి విజయ చంపింది. కానీ కేసును తప్పుదోవ పట్టించడానికి.. తన కొడుకుకి ఫిట్స్ వచ్చి చనిపోయాడని నాటకం ఆడింది. 

అనుమానం వచ్చిన నల్గొండ రూరల్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీఐ బాషా ఆధ్వర్యంలో ఎంక్వయిరీ చేపట్టారు. 2020 ఫిబ్రవరి 21 శివరాత్రి రోజు కేసు నమోదు చేశారు. అయితే ఈ విచారణలో బాలుడి గొంతుని తల్లి నులిమి చంపినట్లుగా వాస్తవాలు బట్టబయలైంది. 

ఈ కేసులో కన్నతల్లి విజయ, ప్రియుడు వెంకట్ రెడ్డిని నిందితులుగా తేల్చారు పోలీసులు. ఈరోజు(2024 జనవరి 24) నల్గొండ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి ఆధ్వర్యంలో జీవిత ఖైదీగా ఇద్దరికి శిక్ష విధించారు.