ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

‘బీజేపీకి ఆదరణ పెరుగుతోంది’

నేరేడుచర్ల, వెలుగు : బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, ప్రధాని మోడీ పాలనకు ఆకర్షితులయ్యే చాలా మంది పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫతేపురానికి చెందిన పలువురు గురువారం బీజేపీలో చేరగా, ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ పంచాయతీలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే కేంద్రం డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా గ్రామాలకే నిధులు మంజూరు చేస్తోందన్నారు. తెలంగాణలో ప్రజల పక్షాన పోరాడుతోంది బీజేపీ ఒక్కటేనని, అందుకే ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొణతం లక్ష్మారెడ్డి, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు, నేరేడుచర్ల పట్టణ అధ్యక్షుడు సంకలమద్ది సత్యనారాయణరెడ్డి, సీనియర్‌‌‌‌‌‌‌‌ నాయకులు నంద్యాల వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పల్లెపంగ వీరబాబు, ప్రధాన కార్యదర్శులు నాగిరెడ్డి, రాజేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌తో బీజేపీ నాయకుల్లో వణుకు

యాదగిరిగుట్ట, వెలుగు :  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆవిర్భావంతో బీజేపీ నాయకుల్లో వణుకు మొదలైందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు లీడర్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గడ్డమీది రవీందర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆమెను కలిసి దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలు, రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ నాగరాజు, నాయుకలు కసావు శ్రీనివాస్, పాపట్ల నరహరి, బద్దూనాయక్, లక్ష్మీనారాయణగౌడ్ పాల్గొన్నారు.

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం

నకిరేకల్‌‌‌‌‌‌‌‌ (కేతేపల్లి), వెలుగు : రాష్ట్రంలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో మల్లన్న గుట్టపై నిర్మించనున్న పచ్చల పార్వతీ సోమేశ్వరాలయం పనులకు గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చోళులు, కాకతీయుల కాలంలో  నిర్మించిన ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయన్నారు. ఈ ఆలయాలు పూర్వ వైభవం కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఇనుపాముల సర్పంచ్‌‌‌‌‌‌‌‌ జాల వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శివాలయం చైర్మన్‌‌‌‌‌‌‌‌ కానుగు యాదగిరిగౌడ్‌‌‌‌‌‌‌‌, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కొప్పుల ప్రదీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు పాశం లలితా ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బత్తుల సత్యనారాయణరెడ్డి, దర్శనపు లింగయ్య పాల్గొన్నారు.  

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తోనే అభివృద్ధి సాధ్యం

నల్గొండ, వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్‌‌‌‌‌‌‌‌ మండలంలోని తేరట్‌‌‌‌‌‌‌‌పల్లి, కమ్మగూడెం, శేరిగూడెం గ్రామాల్లో గురువారం పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి 22 వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయే బీజేపీలో చేరారని ఆరోపించారు. బీజేపీలో చేరిన ఆయన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ విజయం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు బొమ్మరపోయిన వెంకన్న, బొడ్డు సతీశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, ముడిగె ఎర్రన్న, వీరమల్ల శ్రీశైలం, గొరిగె సత్తయ్య, పంకర్ల పద్మ నరసింహ పాల్గొన్నారు.

బీజేపీ లీడర్లపై దాడి చేయడం సరికాదు

తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీజేపీ లీడర్లపై టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం తుంగతుర్తిలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు పథకం ప్రకారమే రాళ్ల దాడి చేశారని ఆరోపించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ దాడిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబాతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. అక్కడే ఉన్న పోలీసులు సైతం బీజేపీ లీడర్లపైనే లాఠీఛార్జ్‌‌‌‌‌‌‌‌ చేశారని, పోలీసులు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అక్రమ ఇసుక సంపాదన రూ.100 కోట్లకు పైగా చేరిందన్నారు. జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరిపోతున్నాయని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అనుచరుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నాడని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల ముందు మాత్రమే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లకు దళితబంధు పథకం గుర్తుకొస్తోందన్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను సైతం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కడియం రామచంద్రయ్య, నాయకులు కాప రవి, మల్లెపాక సాయిబాబా, గాజుల మహేందర్, రమేశ్‌‌‌‌‌‌‌‌, చిరంజీవి, సోమన్న పాల్గొన్నారు.

భవిష్యత్‌‌‌‌‌‌‌‌ తరాలకు ఉపయోగపడే మొక్కలు నాటాలి

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : భవిష్యత్‌‌‌‌‌‌‌‌ తరాలకు ఉపయోగపడే మొక్కలు నాటాలని సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ గెల్లి అర్చన రవి సూచించారు. ఆర్ట్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లివిగ్‌‌‌‌‌‌‌‌ సంస్థ సభ్యులతో కలిసి గురువారం లింగగిరి మేజర్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ గట్టుపై మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయుర్వేద డాక్టర్‌‌‌‌‌‌‌‌ పశ్య సతీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జక్కుల శంభయ్య, ఓరుగంటి నాగేశ్వరరావు, ఉప్పాల రమేశ్‌‌‌‌‌‌‌‌, భిక్షపతి, బోనాల శ్రీనివాస్, శంకర్‌‌‌‌‌‌‌‌రావు, ఊరె వెంకయ్య, గుడిపాటి అనిల్‌‌‌‌‌‌‌‌, చందా ప్రసాద్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

‘ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ ఆలోచన విరమించుకోవాలి’


మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని కృష్ణాతీరంలో కృష్ణా పవర్‌‌‌‌‌‌‌‌ యుటిలిటీస్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం వల్ల కృష్ణా జలాలు కలుషితం అవుతాయని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు కోసం ఈ నెల 10న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న దామరచర్ల మండలంలో కంపెనీలను ఏర్పాటు చేసే సాకుతో భూములను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విలువైన భూముల రక్షణకు రెవెన్యూ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆయన వెంట నాయకులు రాంచంద్రయ్య, వెంకన్న, గోపి, భాస్కర్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

దేశాభివృద్ధి కోసమే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌

మిర్యాలగూడ, వెలుగు : దేశాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ తిరునగరు భార్గవ్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌బీఆర్‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నల్లమోతు సిద్దార్థ అన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌గా మార్చడాన్ని హర్షిస్తూ ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రకటించినట్లు చెప్పారు. కార్యక్రమంలో యర్రమాళ్ల దినేశ్‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాగరాజు, సాధినేని శ్రీనివాసరావు, పత్తిపాటి నవాబ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

డిండి -– దేవరకొండ మధ్య నిలిచిన రాకపోకలు


దేవరకొండ (డిండి), వెలుగు : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో డిండి – దేవరకొండ మెయిన్‌‌‌‌‌‌‌‌ రోడ్డుపై లింగమయ్య వంపు వద్ద గల కల్వర్టుపై నుంచి వరద ఉధృతంగా పారుతోంది. దీంతో డిండి – దేవరకొండ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని డిండి ఎస్సై సురేశ్‌‌‌‌‌‌‌‌ సూచించారు.

ఒక్కరోజే 102  ట్రాక్టర్లు డెలివరీ

ఖమ్మం, వెలుగు: దసరా పండుగ సందర్భంగా ఒక్కరోజే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో  వీవీసీ ట్రాక్టర్స్​ ద్వారా 102  జాన్​డీర్​ట్రాక్టర్లు డెలివరీ చేసి రికార్డు సాధించామని వీవీసీ గ్రూప్​ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. జాన్​డీర్​ ట్రాక్టర్స్​ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయన్నారు. తెలంగాణలో నంబర్​వన్​స్థానంలో ఉన్నాయని చెప్పారు. తక్కువ మెయింటనెన్స్, ఎక్కువ కాలం పని చేసే జాన్​డీర్​ ట్రాక్టర్స్​ అన్నిరకాల వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వీవీసీ ట్రాక్టర్స్​ 22 ఏండ్లుగా నమ్మకమైన, నాణ్యమైన సర్వీస్​ అందించడం వల్లే కస్టమర్లు జాన్​డీర్​ను ఇష్టపడుతున్నారని తెలిపారు. ​కార్యక్రమంలో రాష్ట్ర ఏరియా మేనేజర్​ ప్రణీత్ రెడ్డి, టెరిటరీ మేనేజర్​ గౌతమ్​, వీవీసీ జీఎం లక్ష్మారెడ్డి, ఖమ్మం జిల్లా బాధ్యులు రామ్​ రెడ్డి, నల్గొండ జిల్లా బాధ్యులు ప్రజాపతి పాల్గొన్నారు.

తిరుమలగిరి మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా స్రవంతి

తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా కొమ్మినేని స్రవంతి సతీశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. దీంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌ పాలకవర్గ సభ్యులు గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌తో పనిచేస్తూ మార్కెట్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ యారాల రాంరెడ్డి, డైరెక్టర్లు ఇమ్మడి సోమనర్సయ్య, సామ ఆంజనేయులు, మంచినీళ్ల మహేందర్, జట్టంగి నర్సయ్య, నల్లగంటి మల్లయ్య పాల్గొన్నారు.