మాయమైన ఫర్నిచర్పై విచారణ చేపట్టిన అధికారులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఫర్నిచర్ మాయమవడంపై ఇప్పటివరకు అనేక ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ క్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఫర్నిచర్ మాయమవ్వడంపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. 

నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 15 లక్షలకు పైగా ఫర్నిచర్ మాయమైందని.. జిల్లా వ్యాప్తంగా ఆర్అండ్ బి(డి.ఈ) సురేంద్ర కుమార్ అధికారులతో కలసి విచారణ చేపట్టామని తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా అన్ని క్యాంపు కార్యాలయాలలో ఇదే పరిస్థితి నెలకొందని ఫిర్యాదులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అయితే మాయమైన ఫర్నిచర్ గురించి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్సనల్ సెక్రెటరీకి సమాచారం అందించారు. క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ యధావిధిగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.