అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఎస్పీ అపూర్వ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని బైపాస్వెంట ఉన్న ఇండ్లను టార్గెట్ చేసిన ఇద్దరు తరచూ చోరీలకు పాల్పడుతున్నారు.
బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను మిర్యాలగూడలో పట్టుకున్నారు. వారు ఇప్పటివరకు 20 ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు.
ALSO READ : మోదీ తర్వాత యోగీనే పీఎం ..కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
వారి నుంఇచ రూ.60 లక్షల విలువైన 83 తులాల బంగారం, 8 తులాల వెండి, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మిర్యాలగూడలో ఏస్పీ 36 సీసీ కెమెరాలను ప్రారంభించారు.