నల్గొండ జిల్లా: పీఏ పల్లి మండల మోడల్ స్కూల్లో ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత

నల్గొండ జిల్లా: పీఏ పల్లి మండల మోడల్ స్కూల్లో ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత

నల్గొండ జిల్లా: పీఏ పల్లి మండల మోడల్ స్కూల్లో ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థతకు లోనయ్యారు. వీరిని దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్ తరలించి చికిత్సనందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అన్నం బాగాలేదని విద్యార్థినులు సరిగ్గా తినడం లేదు. ఉదయం దొడ్డు రవ్వ తిని మధ్యాహ్నం అన్నం బాగోలేక విద్యార్థినులు తినలేదు. సాయంత్రం వాంతులు అయి అస్వస్థతకు గురయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పూజిత, మౌనిక, మల్లీశ్వరి, హరిణి, సెకండ్ ఇయర్ చదువుతున్న నిఖిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి పరామర్శించారు.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా స్కూళ్లు, హాస్టళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూస్తున్న క్రమంలో సర్కార్ అలర్ట్ అయింది. ఇప్పటి వరకు జరిగిన ఫుడ్ పాయిజన్​ ఘటనలకు గల కారణాలు తెలుసుకోవడంతోపాటు.. అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ హాస్టళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి  ఆహార పదార్థాల నిల్వ, వంట పాత్రల పరిశుభ్రత, ఆహారం వడ్డించడం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని డిసైడ్ అయింది. వంట చేసే వ్యక్తుల శుభ్రత, వారి ఆరోగ్యం ఎలా ఉందనేదానిపై కమిటీ సభ్యులు ఆరా తీయనుంది. ఒక ఏఎన్ఎం, హెడ్ కుక్, టీచర్కు భోజన నాణ్యత పరిశీలించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు.