యాదాద్రి, వెలుగు: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్బాటలోనే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు శనివారం సోషల్ మీడియాలో పోస్టులు వైరలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన ఆలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న శేఖర్‌రెడ్డి హైకమాండ్ కాదంటే పార్టీ మారతారని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు బూర నర్సయ్య రాజీనామా చేయడంతో పైళ్ల కూడా ఆలేరు నుంచి టికెట్ కమిట్మెంట్ తీసుకుని ఆయన వెంట బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఖండించారు.
కేసు నమోదు
ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్‌మీడియాలో పోస్టు చేసిన నీలం శ్రీనివాస్‌పై భువనగిరి టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. టీఆర్ఎస్ లీడర్ కిరణ్ కంప్లైంట్‌తో పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర అమోఘం
మునుగోడు, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి కొనియాడారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ విజయాన్ని కోరుతూ యూకే- లండన్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రిక ను శనివారం మునుగోడు మండలంలోని ఆర్కే ఫంక్షన్హాల్లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం పై విదేశాల్లో ఉన్న వారిలోనూ నమ్మకం పెరగడం శుభ సూచకమన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి మూడో స్థానంలో ఉంటుందన్నారు. యూకే లండన్ విభాగం చైర్మన్ అనిల్ కుర్మాచలం, శాన బోయిన రాజ్ కుమార్, వల్లాల శ్రీనివాస్ తదితరులు
పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు ఆర్థిక సాయం
సూర్యాపేట, వెలుగు: తల్లిదండ్రులను కోల్పోయిన ఆడ బిడ్డలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అండగా నిలిచారు. ఇటీవల చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ
బీజేపీ కార్యకర్త పిట్టల రామయ్య అనారోగ్యంతో చనిపోయారు. గతంలోనే రామయ్య భార్య కూడా మరణించడంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలకు ఆర్థికసాయం
చేసి వారి చదువులకు బాధ్యత తీసుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.
డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఏమైనయ్
మిర్యాలగూడ, వెలుగు : దసరాకే పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పారని, ఇంకా పంచలేదేమిటని బీఎల్ఎఫ్ రాష్ర్ట కమిటీ సభ్యుడు వస్కుల మట్టయ్య రాష్ర్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం మిర్యాలగూడ ఆర్డీవో ఆఫీస్ ఎదుట బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పేద వర్గాలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. లీడర్లు సైదమ్మ, గోపి, కాశి , జ్యోతి, ఎల్లమ్మ , సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రతి వెహికల్‌ను పక్కాగా పరిశీలించాలి
నల్గొండ అర్బన్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతి వెహికల్‌ను పక్కాగా తనిఖీ చేయాలని ఎస్పీ రెమా రాజేశ్వరి పోలీస్ఆఫీసర్లకు , సిబ్బందికి సూచించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎస్పీ మునుగోడు బార్డర్లో ఏర్పాటు చేసిన గూడపూర్ చెక్ పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమైన జంక్షన్లు, నియోజకవర్గంలోకి ప్రవేశించే ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి డబ్బు, లిక్కర్సరఫరా కాకుండా నిఘా ఉంచాలన్నారు. దోమలపల్లి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని చండూరు సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై సతీష్ రెడ్డి లను ఆదేశించారు. మొత్తం 104 గ్రామాలకు క్లస్టర్ ఆఫ్ విలేజ్ గా చేసుకొని ఆ గ్రామానికి ఒక ఎస్సై, 10 మంది సిబ్బందిని నియమించామని ఎస్పీ చెప్పారు. వీరు నిరంతరం పని చేస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్చేస్తారన్నారు.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయం
చండూరు, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం చండూరులో పార్టీ ముఖ్య కార్యకర్తల మీటింగ్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎందరో వీరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్కుటుంబ పాలనతో ఆగమాగం చేస్తుండన్నారు. గెలిచినంక అమ్ముడు పోయే కాంగ్రెస్‌పార్టీని మునుగోడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మోడీ పాలనలో ప్రజలు క్షేమంగా ఉన్నారని, దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్బీసీలను అణచివేస్తోందని అందుకే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నాగురావ్నామాజీ, కోమటి వీరేశం, అన్నెపర్తి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన ఎంపీపీ దంపతులు
హైదరాబాద్, వెలుగు : మునుగోడు కాంగ్రెస్ నేత, చండూరు ఎంపీపీ కల్యాణి , ఆమె భర్త, టీపీసీసీ కోఆప్షన్ సభ్యుడు పల్లె రవికుమార్ శనివారం టీఆర్‌ఎస్ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్లో వారికి కండువాలు కప్పారు. తెలంగాణ ఉద్యమంలో తమతో కలిసి పనిచేసిన రవి మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి రావడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. చండూరును రెవెన్యూ డివిజన్ చేయాలన్న ప్రజల కోరికను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కల్యాణి, రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఏమైనయ్
మిర్యాలగూడ, వెలుగు : దసరాకే పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పారని, ఇంకా పంచలేదేమిటని బీఎల్ఎఫ్ రాష్ర్ట కమిటీ సభ్యుడు వస్కుల మట్టయ్య రాష్ర్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం మిర్యాలగూడ ఆర్డీవో ఆఫీస్ ఎదుట బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పేద వర్గాలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. లీడర్లు సైదమ్మ, గోపి, కాశి , జ్యోతి, ఎల్లమ్మ , సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ పాలనను సాగనంపుదాం
మునుగోడు, వెలుగు: రాష్ట్రంలో కుటుంబ పాలనను సాగనంపుదామని బీజేపీ నేత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. శనివారం మునుగోడు మండలంలోని రావి గూడెం లో 50 మంది యువకులు శోభ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడు పల్లెల్లో తిరుగుతున్నారని విమర్శించారు. ఎన్నికల టైంలోనే సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారని , మిగతా సమయంలో ఫామ్‌హౌస్‌లో సేద తీరుతారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సతీశ్, ప్రీతం రెడ్డి, గణేశ్
తదితరులు పాల్గొన్నారు.
గొంగిడి దంపతులను విమర్శిస్తే ఊరుకోం
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని సర్పంచులు ఫోరం జిల్లా అధ్యక్షుడు కర్రె వెంకటయ్య హెచ్చరించారు. యాదగిరిగుట్టలో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య చేసిన ఆరోపణలను ఖండించారు. బీర్ల అయిలయ్య గురించి తాను రాజకీయ విమర్శలు మాత్రమే చేశానని, వ్యక్తిగత విమర్శలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయిలయ్య.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధ, చొల్లేరు సర్పంచ్ బీరయ్య, మైలారుగూడెం ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎలక్షన్ అబ్జర్వర్ విస్తృత తనిఖీలు
మునుగోడు, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీ తో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు ముళ్లపూడి సమత ఆదేశించారు. శనివారం ఆమె మునుగోడు, నారాయణ పూర్, గట్టుప్పల్ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఉప ఎన్నిక సందర్భంగా మోడల్ కోడ్అమలు, వైన్ షాప్ లను తనిఖీ చేశారు. ఆమె వెంట సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు సురేశ్ తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్లో ఎన్నికల కంట్రోల్ రూమ్
నల్గొండ అర్బన్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నిక కు సంబంధించి నల్గొండ కలెక్టరేట్లో స్పెషల్కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. కంట్రోల్ రూమ్‌కు ప్రత్యేక సెల్‌నంబర్08682 230198 ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ జరిగినా, ఇతరత్రా ప్రలోభాలకు గురి చేసినా, ఓటు వేయకుండా అడ్డుకున్నా, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసినా, ఎలక్షన్కోడ్ఉల్లంఘించిన వారిపై ప్రజలు కంప్లైంట్చేయొచ్చన్నారు.
గొర్రెల లబ్ధిదారులు టీఆర్ఎస్ కు ఓటెయ్యాలి
నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో గొర్రెల లబ్ధిదారులు టీఆర్ఎస్కు ఓటెయ్యాలని తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కోరారు. శనివారం
చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట, దండు మల్కాపూర్, ఖైతాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12,661 మంది లబ్ధిదారులకు రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.93 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు.