మున్సిపల్ కార్మికులకు నల్గొండ జిల్లా ఎస్సీ అపూర్వరావు సన్మానం

నల్లగొండ జిల్లా : నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు మున్సిపల్ కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి.. వారి సేవలను కొనియాడారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్న మేకల అభినవ్ స్టేడియంలో పని చేసిన కార్మికులకు ప్రత్యేక రివార్డ్ అందించారు. ఐదు రోజుల పాటు గ్రౌండ్ ను శుభ్రం చేయడంపై మున్సిపల్ సిబ్బందికి ఎస్పీ అపూర్వరావు అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా తమ పనిని జిల్లా పోలీస్ అధికారిణి గుర్తించడంతో  మున్సిపల్ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.