నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిడమనూరు మండలం వెంకటాపురం సమీపంలో అక్టోబర్ 09 రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందారు. మృతుడు మధు స్పెషన్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF) కానిస్టేబుల్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
Also Read :- మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో ఊరట
గత రాత్రి సమయంలో నల్గొండ హాలియా రహదరిపై గుర్తుతెలియని వాహనం కానిస్టేబుల్ ని ఢీకొని వెళ్లిపోయింది. దీంతో కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నాగార్జున సాగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.