ఏసీబీ వలలో నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్

నల్లగొండ జిల్లా అవినీతి చేప ఏసీబీకి చిక్కింది.  లంచం తీసుకుంటూ నల్లగొండ డ్రగ్ ఇన్ స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికారు. ఓ ఫార్మసీ అనుమతికోసం లంచం తీసుకుంటుం డగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ డ్రగ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న సోమేశ్వర్ ను రూ. 18వేల లంచం తీసుకుంటుండగా సోమవారం (ఏప్రిల్ 15) ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫార్మసీ అనుమతి కొరకు వెళ్లిన ఓ వ్యక్తినుంచి లంచం డిమాండ్ చేశారు సోమేశ్వర్. దీంతో బాధితుడు రూ. 18 వేలు సోమేశ్వర్ కు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలోనూ సోమేశ్వర్.. మెడికల్ షాప్స్ నుంచి నెల వారీగా వసూళ్లు చేశాడని అనేక ఆరోపణలు ఉన్నాయి.