హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దివీస్ ఇండస్ట్రీ చుట్టూ ఉన్న చెరువుల నుంచి నీటి తరలింపు, ఆ చెరువుల్లోకి హానికారక కెమికల్స్ వ్యర్థాల విడుదలపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులను హైకోర్టు ఆదేశించింది. దివీస్ కూడా కౌంటర్ దాఖలు చేయా లని నోటీసులు జారీ చేసింది.
దివీస్ లేబ రేటరీస్ నుంచి కెమికల్ వ్యర్థాలు విడుదల చేయడంతో తమ ప్రాంతంలోని చెరు వులు, మూసీ నది నీళ్లు, భూగర్భ జలాలు, గాలి కాలుష్యం అవుతోందని 2012లో వలిగొండ మండలం గోల్నేపల్లి, నెమలి కల్వ రైతులు హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని పిల్‌గా పరిగణించిన హైకోర్టు విచా రణ జరుపుతోంది. స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని పీసీబీని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి డివి జన్ బెంచ్ ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.