రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్

మెడికల్‌ బిల్లులు చెల్లించడానికి రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే..

లంచం తీసుకుంటుండగా నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హాస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుంచి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్. 

Also read : కైట్స్ Vs డ్రోన్స్ : ఢిల్లీ బోర్డర్ లో రైతుల వినూత్న ఐడియా

అయితే లచ్చు నాయక్ తనను ఇబ్బంది పెడుతున్నాడని కాంట్రాక్టర్  వెంకన్న ముందుగానే ఏసీబీ అధికారులను కలిశాడు. దీంతో పథకం ప్రకారం లచ్చు నాయక్ ఇంట్లో ఈరోజు(ఫిబ్రవరి 16) కాంట్రాక్టర్ డబ్బులు  ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఇంట్లో  ఇంకా తనిఖీ లు కొనసాగుతున్నాయి.