నల్గొండ ఇంటెలిజెన్స్ ఎస్పీ కవిత అవినీతిపై విచారణ-.. డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు

నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ కవిత  అక్రమాలు, వసూళ్ల పై రాష్ట్ర ఇంటలిజెన్స్ స్పెషల్ టీం విచారణ చేపట్టింది.  అవినీతి నిజమే అని తేలడంతో  డీజీపీ  ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఆమె స్థానంలో శ్రీనివాస్ రావుకు పోస్టింగ్ ఇచ్చింది.  ఆమె అవినీతి చిట్టాను గుర్తు తెలియని వ్యక్తులు  సమగ్రంగా డీజీపీ ఆఫీస్ కు నివేదిక పంపించడంతో విచారణ మొదలైంది.

పోలీస్ అధికారి కవిత  లాంగ్ స్టాండింగ్ అధికారిగా నల్లగొండ జిల్లా లో పాతుకుపోయింది.  జిల్లా ఇంటెలిజెన్స్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ తల్లిని విద్యుత్ శాఖలో ఉద్యోగానికి కూడా పంపించకుండా వేతనాన్ని తీసుకున్న  వైనం పై ఆరా తీసింది ఇంటెలిజెన్స్ టీం. కవిత అవినీతపై విచారణ కొనసాగుతుంది.

Also Read :- కొండ పోచమ్మ రిజర్వాయర్ లో మునిగి.. ఐదుగురు మృతి

నల్గొండ జిల్లాలో మరో ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులపై కూడా విచారణ కొనసాగుతోంది.  ఇల్లీగల్ దందాలు చేసిన ఓ DSP, సీఐ పై రిపోర్ట్ రెడీ చేసినట్లె తెలుస్తోంది. ఇందులో మరో ఉన్నతస్థాయి అధికారి పాత్ర పై విచారణ జరుగుతోంది.  విచారణ టీం తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  ఇంటెలిజెన్స్ అడిషనల్ SP కి సహకరించిన వారితో పాటు వారు చేసిన అక్రమాలపై కూడా పూర్తిస్థాయిలో నివేదిక రెడీ చేసినట్లు సమాచారం.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆధ్వర్యంలోను మరో టీం విచారణ కొనసాగుతోంది.  ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు వార్నింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ విచారణ అనంతరం నిజానిజాలను తేల్చనున్న స్టేట్ ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్లడించింది.