నల్లగొండ జిల్లా: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం ఉన్న అభ్యర్థుల్లో 47మంది ఎలిమినేషన్ ప్రక్రియలో తొలగించారు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ కూడా ఎలిమినేట్ అయ్యారు. 47 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్న19వేల 375 ఓట్ల మెజార్టీ ఉంది. అయినా కావాల్సిన కోట లక్షా55 వేల 095 ఓట్లకు చేరుకోని అభ్యర్థులు.. దీంతో గెలుపు కోట కు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి ఎలిమినెట్ చేసే అవకాశం ఉంది.
శుక్రవారం రాత్రి 11 గంటలకు తుది ఫలితాలు వెల్లడవుతాయి. తీన్మార్ మల్లన్న గెలుపు కన్ఫమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో కౌంటింగ్ సెంటర్ దగ్గరకి భారీగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్, అభిమానులు చేరుకుంటున్నారు. బాణసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.