కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి సూసైడ్

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి సూసైడ్

చిట్యాల, వెలుగు : కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన రెమడాల గట్టయ్య(49) కూతురు మార్చి 8న ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత తమకు రక్షణ కల్పించాలని వారు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను ఆశ్రయించారు. ఒకసారి కూతురుని పిలిపించాలని తండ్రి కోరినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 10న గట్టయ్య పురుగు మందు తాగాడు.

కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం గట్టయ్య చనిపోయాడు. గట్టయ్య ఆత్మహత్యకు పోలీసుల నిర్లక్షమే కారణమని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్  ఎదుట మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.