8నెలల నుంచి జీతాలు ఇస్తలేరు.. మేము ఎట్లా బతుకాలే..

నల్గొండ మెడికల్ కాలేజ్ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. మెడికల్ కాలేజ్ కు సంబంధించిన డాక్టర్స్, సిబ్బంది ఎవరు  బయటికి పోకుండా గేటుకు తాళం వేసి.. ధర్నా చేపట్టారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గత ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతుంటే.. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

సరైన జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం రూ. 80 లక్షలు విడుదల చేసి.. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ జీతాలను చెల్లించకుండా ప్రిన్సిపల్  కక్ష సాధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్నా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

డిమాండ్లు..

  • 4 సంవత్సరాలుగా 5,6 వేల జీతాలు మాత్రమే ఇస్తు్నారు, జీతాలను పెంచాలి.
  • తెలంగాణలో అన్ని మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టర్లను మార్చి.. జీతాలు రూ. 15,600 పెంచారు.
  • నల్గొండ మెడికల్ కాలేజ్ లో మాత్రమే వేతనాలు పెంచలేదు.
  • 15,600 వేతనాలు ఇవ్వడం లేదు.
  • పీఎఫ్, ఈఎస్ఐ లను సకాలంలో కట్టాలి.
  • ఉద్యోగ భద్రత కల్పించాలి.
  • అర్డర్ కాపీలను ఇవ్వాలి.
  • కాలేజ్ లో యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవడం లేదు.
  • గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. వాటిని వెంటనే ఇవ్వాలి.
  • 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐని వెంటనే కట్టాలి.