- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : తుదిశ్వాస వరకు ప్రజా సేవ చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన బర్త్‌డే సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. క్యాంప్ ఆఫీస్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అంతకుముందు పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో వేదపండితులు ఆయుష్య హోమం నిర్వహించారు.
AlLSO READ : యాదగిరిగుట్ట నారసింహుడికి వెండి కలశాలు
జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, గ్రంథాలయ చైర్మన్ రేగట్ట మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, సీనియర్ నేతలు కృష్ణా రెడ్డి, మల్లేశ్ గౌడ్, సత్తయ్య గౌడ్, శరణ్య రెడ్డి, ఎంపీపీలు కరీం పాషా, విజయలక్ష్మి లింగారావుతో పాటు వందల సంఖ్యలో నేతలు భూపాల్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.