దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లు గెలవడం ఖాయం : శానంపూడి సైదిరెడ్డి

నల్గొండ​ అర్బన్, వెలుగు : లోక్​సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలువడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి అన్నివర్గాల ప్రజలు కృషి చేస్తున్నారని తెలిపారు. 

పిల్లిరామరాజు రాకతో నల్లగొండ నియెజకవర్గంలో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియెజకవర్గ పరిధిలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన యువకులు సైదిరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలకు చేరినవారికి కండువా కప్పి ఆహ్వానించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీదేవిరెడ్డి, పోతెపాక సాంబయ్య, మోహన్​రెడ్డి, విద్యాసాగర్​రెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.