- నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి,
- ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి
హాలియా, వెలుగు : ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజాసేవలో భాగస్వాములు కావాలని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. గురువారం నిడమనూరు మండలం కోటమైసమ్మ టెంపుల్ వద్ద ఫంక్షన్ హాల్లో త్రిపురారం మండలానికి చెందిన పదవీ కాలం పూర్తిచేసుకున్న ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ పేదల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా పార్టీ నాయకులు కృషి చేయాలని చెప్పారు. అనంతరం పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాలికలు ఉన్నత విద్యనభ్యసించాలి..
మిర్యాలగూడ, వెలుగు : ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ బాలికలు ఉన్నత విద్యనభ్యసించాలని ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలో రూ.2.70 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.
బాల్య వివాహాలను నిరోధించేందుకు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు దోహదపడుతున్నాయన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రుల నమ్మకాలకు అనుగుణంగా గుణాత్మకమైన విద్యనందించాలని టీచర్లకు సూచించారు.