నిరుద్యోగ సమస్య పరిష్కారంలో మోడీ, కేసీఆర్ విఫలం : ఎంపీ ఉత్తమ్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో,  కేంద్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి  అనుకూలంగా ఉన్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. భారతదేశంలో ఇండియన్ ఎలివేషన్స్ బలంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాలకుపైగా సీట్లు వస్తాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ మోసపూరిత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితవర్గానికి చెందిన ఒక్క మంత్రి కూడా లేడన్నారు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఎంపీ ఉత్తమ్ ఈ కామెంట్స్ చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ 90 పథకాలు పెడితే అందులో తొమ్మిది పథకాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో మోడీ, కేసీఆర్ విఫలమయ్యారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక వస్తుందని గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించారని చెప్పారు. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్  స్విప్ చేస్తుందన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే నాలుగు హామీలు నెరవేర్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు BRS ప్రభుత్వాన్ని గద్దె దించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆత్రుతుగా చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్ద వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ వే నడుస్తోందన్నారు.