నల్గొండ అర్బన్, వెలుగు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 125.78 కోట్లతో నల్గొండ మున్సిపాలిటీ బడ్జెట్ ను పాలకవర్గం ఆమోదించింది. మున్సిపల్ బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని బలోపేతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో పాటు తరగతి గదుల నిర్మాణం, ఇతర సమస్యలను గుర్తించి పరిష్కారించాలన్నారు. అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆస్తి పన్ను, నల్లాబిల్లుల వసూళ్లపై దృష్టి పెట్టాలని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కౌన్సిలర్లు వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ పాల్గొన్నారు.
ALSO READ : యాదాద్రి ఆలయానికి రూ. 3కోట్ల బిల్డింగ్ విరాళం