
నల్గొండ : నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇవాళ శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్‌గా మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. కాగా గత నెల జనవరి 8న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని బీఆర్‌ఎస్ కోల్పోయింది. ఆర్అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్నికాంగ్రెస్ కైవసం చేసుకుంది.