నల్గొండ మున్సిపల్ రాజకీయం రసవతకరంగా మారింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లను క్యాంపుకి తరలించారు. జనవరి 8న జరగబోయే కౌన్సిల్ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కొత్త చైర్మన్ ను ఎన్నుకుంటామన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్. BRS నేతలు విప్ పేరుతో కౌన్సిలర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కౌన్సిలర్లకు ఎలాంటి విప్ జారీ చేయలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై మహిళా కౌన్సిలర్లపై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని ఆరోపించారు.
అధికారంలో ఉన్నప్పుడు BRS నేతలు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదన్నారు. ఇప్పుడు మున్సిపల్ చట్టం పేరుతో కొత్త డ్రామా స్టార్ట్ చేశారని ఆరోపించారు రమేష్. నల్గొండ మున్సిపాలిటీ రాష్ట్రంలోని బెస్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు.