భారీగా ట్రాఫిక్ జామ్..5 కి. మీ మేర నిలిచిన వాహనాలు

నల్గొండ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముందుకు పోలేక..వెనక్కు రాలేక మధ్యలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.

ఏమైందంటే..

నల్గొండ శివారులోని నార్కెట్‌పల్లి- అద్దంకి  రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ గోడను భారీ ట్రక్కు ఢీకొట్టింది. జూన్ 24వ తేదీ శనివారం ఉదయం మిర్యాలగూడ నుంచి నార్కెట్ పల్లి వెళ్తున్న లారీ ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర గల నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ను ఢీకొట్టింది.  దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  వాహనాలు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని భారీ క్రేన్ తో పక్కకు జరిపారు. దీంతో  అక్కడ ట్రాఫిక్‌ క్లియర్ అయింది.