నల్లగొండ: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.. ప్రతి యేటా లక్షలు చెల్లించి గణేషుడి లడ్డూని కొనుగోలు చేస్తుంటారు భక్తులు..తెలంగాణలో హైదరాబాద్ నగరంతో పాటు జిల్లా్ల్లో కూడా గణేషుడి లడ్డూ దక్కించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. లడ్డూవేలంలో రాష్ట్ర రాజధానిలోని బాలాపూర్ గణేషుడు ప్రతీసారీ రికార్డు సృష్టిస్తూ ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు అదే తరహాలు లక్షలు వెచ్చింది లంబోదరుడి లడ్డూను కొనుగోలు చేస్తున్నారు.
నల్లగొండ పట్టణానికి చెందిన భక్తులు కూడా వేలంలో పాల్గొని పార్వతీ పుత్రుడి లడ్డూను లక్షలు వెచ్చింది సొంత చేసుకున్నారు. నల్లగొండ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఒకటో నెంబర్ వినాయకుడి లడ్డూ వేలం హోరాహోరీగా కొనసాగింది. చాలా ఆసక్తిగా సాగిన వేలంలో కరణ్ జయరాజ్ 36 లక్షలు వెచ్చించి గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు.