నల్గొండలోని సాయి రక్ష ఆసుపత్రి వైద్యులు ఓ మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సంవత్సరం క్రితం మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో క్లాత్ ను అలాగే వదిలేశారు. ఆపరేషన్ తర్వాత వసంత తీవ్రమైన కడుపునొప్పికి గురయింది. దీంతో ఆమె హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో చేరింది. అక్కడ డాక్టర్లు స్కానింగ్ చేయడంతో వసంత కడుపులో క్లాత్ ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించి వసంత కడుపులో నుంచి క్లాత్ ను బయటకు తీశారు.
అసలు ఏమైందంటే..
మునుగోడుకు చెందిన వసంత కడుపు నొప్పితో బాధపడుతూ సాయి రక్ష ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమెకు సిజేరియన్ చేసిన సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా క్లాత్ ను కడుపులోనే వదిలేశారు.
ఈ ఘనటపై వసంత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్ల ప్రాణాలతో చెగాటం అడుతున్న సాయిరక్ష హాస్పిటల్ ను సీజ్ చేయాలంటూ మండిపడ్డారు. ఆపరేషన్ పేరుతో సంవత్సరం క్రితం లక్షల్లో వసూలు చేశారని ఆరోపించారు. సాయిరక్ష ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.