ఎన్నికల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఎన్నికల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : వరంగల్-, ఖమ్మం,- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించి వివిధ మాధ్యమాల ద్వారా జారీ చేసే ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ మీడియా సెంటర్ ను ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే వ్యతిరేక, అనుకూలమైన వార్తలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి చెల్లింపు వార్తలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని కోరారు. ఎన్నికల కమిషన్ జారీ చేసే నియమ, నిబంధనలను అభ్యర్థులందరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఎంసీఎంసీ సభ్యులు కోటేశ్వరరావు, శేషాచార్యులు, ఏవో మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు. 

నేడు మినీ సరస్ ఫెయిర్ 

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 4న నల్గొండలోని శివాజీ నగర్ టీటీడీ కళ్యాణమండపంలో మినీ సరస్ ఫెయిర్ 2025 ను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్​లో మినీ సరస్ ఫెయిర్ గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామీణ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.