పెళ్లాన్ని కొట్టి చంపి.. గుండెపోటు అంటూ నాటకం.. ఇలా బయటపడింది

  • వల్లభ్​ని అరెస్ట్ చేసిన పోలీసులు

నల్లగొండ కాంగ్రెస్​ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్​రెడ్డి తన భార్యను హత్య చేశారన్న ఆరోపణలతో జులై 29న అరెస్ట్​ అయ్యాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుగొలిపే వివరాలు బయటపడుతున్నాయి. గుండెపోటని నమ్మించి భార్యను హాస్పిటల్​లో అడ్మిట్​ చేసిన నిందితుడు ఆమెను కొట్టి చంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పోస్టు మార్టం నివేదిక ప్రకారం..  వల్లభ్​రెడ్డి తన భార్య లహరితో హిమాయత్​నగర్​లో నివసిస్తున్నాడు. వీరిరువురికి తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో ఆమెను గుండె పోటు కారణంతో హాస్పిటల్​లో అడ్మిట్​ చేశాడు. అక్కడి చికిత్స పొందుతూ లహరీ మృతి చెందింది. 

అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా భర్త అంత్యక్రియలు పూర్తి చేశాడు. దినకర్మకు 10 వేల మందికి భోజనాలు కూడా పెట్టాడు. అయితే లహరీ తల్లిదండ్రులు మృతదేహంపై గాయాలను గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు​ చేశారు. 

కేసు దర్యాప్తును స్పీడప్​ చేసిన పోలీసులు ఆమె డెడ్​బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. భార్యకు గుండె పోటని భర్త చెప్పాడని.. కానీ ఆమెకు శరీరంలో గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. 

పొట్టలో రక్తం చాలా వరకు పోయింది. పోస్టుమార్టం నివేదిక పరిశీలించిన పోలీసులు వల్లభ్​రెడ్డిని అరెస్ట్​ చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లహరీ పేరెంట్స్ పై కూడా వల్లభ్​ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ  హత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.